Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 27 January 2017

నవలోకం

నవలోకం
పరిమళించే పున్నమిలో
వెన్నెల జలకాలాడాలని ఉంది
వికసించిన తోటలో
అందమైన పువ్వులా నవ్వాలని ఉంది
మెరిసే హిమవన్నగంలో
స్వాతిముత్యమై కరిగిపోవాలని ఉంది
విరిసే పెదాలలో
ఓ నవ్వులా మెరిసిపోవాలని ఉంది
భావాల ఝరిలో
అక్షర వర్షమై కురిసిపోవాలని ఉంది
నన్ను మెచ్చని లోకం వీడి
మరోప్రపంచం శోధించాలని ఉంది
తథ్యమైన మరణంతో నన్ను పునీతం చేసి
భగవాన్
నవలోకానికి నాంది పలకవా

Thursday 26 January 2017

నువ్వు నాతోనే ఉన్నావని

నువ్వు నాతోనే ఉన్నావని 

కాల్పనిక కథల సజీవ దృశ్యమా
రెక్కలు విప్పిన కలలకు అందమైన రూపమా
మనసులోని భావాలకు కంటి తెరల చిత్రమా
గడచిన ఘడియల అపురూప నిక్షిప్తమా
కంటి చూపుతో నీవు  విసిరిన కావ్యమా
ఇది నిజమైన నిజమా
అందమైన అబద్దమా
నిజం కానే కాదని తెలిసినా
కనురెప్పల భ్రాంతి అని తెలిసినా
విజ్ఞానానికి అందని సత్యమేదో
నన్ను నమ్మిస్తూనే ఉంది
నా మనసు నమ్ముతూనే ఉంది
నువ్వు నాతోనే ఉన్నావని...