Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 24 August 2019

నేనంటే నేనే...


నేనంటే నేనే...
నేనంటే నాకు చచ్చేంత ప్రేమ
అందరిలా కాదు నాలా బతుకుతున్నందుకు నేనంటే నాకు ఆకాశమంత అభిమానం
భావాలపూదోటలో విహరించే నేనంటే నాకు గులాబీలంత ఇష్టం
విలువలను వలువలుగా మార్చని నేనంటే నాకు దేవుడంత పారవశ్యం
నేనంటే నాకు చంపేసేంత ద్వేషం
అందరిలా కాలేకపోయిన నేనంటే నాకు ఎంతో కోపం
తోటివారు ఆకాశంలో విహరిస్తున్నా నేల మీద పాకుతున్న నేనంటే నాకు అసహ్యం
అందుకే ఇంకా
ప్రేమా ద్వేషాల గమనంలో అలసిన బాటసారిలా నడుస్తున్న నన్ను నేను ప్రేమిస్తూనే అసహ్యించుకుంటున్నా

Saturday 17 August 2019

భయం


భయం
అవును నాకు భయం
ఆనందాల మాటున 
నక్కి ఉన్న విషాదాలంటే భయం...
ఉషస్సుల వెనుకే పరుగున వచ్చే 
నిశి రక్కసి అంటే ఎంతో భయం ...
గెలుపు వెనుకే దాగిన ఓటమి
అంటే మరీ భయం...
మరణం తర్వాత ఉందో లేదో
తెలియని స్వర్గం కోసం
నరకంలో జీవించటమంటే
చచ్చేంత భయం...