Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 7 September 2019

జిందగీ


జిందగీ

జీవితానికి నాకు తోచిన నిర్వచనం
జీవితమంటే క్విడ్ ప్రోకో మాత్రమే
ఇక్కడ ప్రేమైనా
స్నేహమైనా
బంధమైనా
అనుబంధమైనా
భావమైనా
ముభావమైనా
చివరకు అది
పగ ప్రతికారమైనా
నీకింత నాకెంత
ఇదేకదా జిందగీ

Tuesday, 3 September 2019

అంతా శూన్యమే


అంతా శూన్యమే
చల్లని వెన్నెల సొగసులు
నులివెచ్చని సూర్యకిరణాలు
సాగర కెరటాల విన్యాసాలు
మైమరిపించే ప్రకృతి అందాలు
ఇవేమన్నా గొప్పా
మనం చూసినంత కాలమే
ఇవి అద్భుతాలు
మనమే కళ్ళు మూసుకుంటే
అంతా శూన్యమే కదా...