ఒక్క వరమివ్వు చాలు
నాన్న భుజమెక్కి ఊరేగాలని
ఉంది...
అమ్మ చీర కొంగు చాటున
దాగుడుమూతలు ఆడాలని ఉంది...
పిప్పర్ మెంటు కావాలని
పదిపైసల కోసం చింతచెట్టెక్కి
అలిగి కూర్చోవాలని ఉంది...
అమ్మ గోరు ముద్దలు పెడుతుంటే
వద్దు వద్దంటూ మారాం చేయాలని ఉంది...
దేవుడా నిజంగానే నువ్వుంటే
నా యవ్వనం లాగేసుకో
వృద్దాప్యం తీసేసుకో
నన్ను చిన్న పిల్లాడిలా
మార్చేయ్ చాలు
అప్పుడు అమ్మా నాన్న
నాతోనే ఉంటారుగా...