నిన్న నేడు రేపు
నిన్న నాకు బాగా తెలుసు
అది చేసిన గాయాలూ
పూసిన లేపనాలూ
పాదాలను తాకిన విజయాలూ
కానుకగా అందించిన పరాజయాలూ
అందుకే నిన్నను నేను పట్టించుకోను...
నేడు నాతోనే ఉంది
విరిసే నవ్వులా
తారాడే కన్నీటి పువ్వులా
గెలుపులా
ఓటమిలా
నేడు నాతోనే నడుస్తూ ఉంది
అందుకే నేడు నాకు నేస్తమే...
రేపంటేనే భయం నాకు
అదింకా నాకు పరిచయం కాలేదు గనుక...
No comments:
Post a Comment