గుండెల్లో చోటివ్వు...
అనురాగం ఉదయించినా...
విరాగం జనియించినా...
ఆనందం పల్లవించినా...
విషాదం అలుముకున్నా...
ఆవేశం తాండవించినా...
వలపులు నర్తించినా...
భాషలే మూగబోయినా...
భావమే మాయమైనా...
చీకట్లే అలుముకున్నా...
మెరుపులే విరజిమ్మినా...
ప్రేమలే కురిసినా...
ద్వేషమే ఉబికి వచ్చినా...
నీ మనస్సు గుడిలో ...
కాస్తంత చోటిస్తే...
వికసించదా...
నా జన్మ...
మనస్వినీ...
No comments:
Post a Comment