Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 30 December 2014

కాలిన స్వప్నం...



కాలిన స్వప్నం...

 
చితికిన మనసులో ...
రగిలిన చితిలో ...
మండుతున్న మంటల్లో...
ఒక్కో స్వప్నాన్ని ...
సమిధగా విసురుకున్నా...
కాలుతున్న కలల్లో...
బూడిదవుతున్న ...
ఆశలనే చూసుకున్నా...
ఆశలలో వాడిన పువ్వులనే ...
చూసుకున్నా...
వాడిన పువ్వుల్లో ...
రాలిన పుప్పొడిలో...
చెదిరిన నా అక్షరాలనే ...
ఏరుకుంటున్నా...
ఒక్కో అక్షరంలో...
నీ గీతాలనే...
స్మరించుకున్నా...
అగ్ని శిఖల్లో ఆవిరవుతున్న ...
కన్నీటి చుక్కలనే ...
ముద్దాడుకున్నా...
కాలిన కలల నుంచి...
గాలికి చెదిరిన ధూళి...
నింగికెగసి...
ఒక పొగ మేఘంలా...
ఒక ఆకృతిలా...
ఒక రూపంలా ...
కనులకు తాకితే...
ఆ రూపంలోనూ ...
నన్ను నేనే చూసుకున్నా...
మనస్వినీ...

No comments:

Post a Comment