అగ్ని కెరటాలు...
వెండి వెన్నెల కడలిని చూసి...
వెన్నెల కెరటాలని...
ఆరాటపడ్డాను...
పున్నమి వెన్నెల సొగసులని...
మురిసిపోయాను...
నా వైపు దూసుకు వస్తున్న ...
అలల మెరుపులను చూసి...
ఇంద్ర ధనుస్సు రంగులని...
పొంగిపోయాను...
సముద్రమంతటి జీవితంలో...
చిన్న తెప్పనే పడవగా...
మలుచుకుని ముందుకే సాగాను...
దూరంగా సుదూరంగా...
నా వైపు చొచ్చుకు వస్తున్న...
ఆ సువర్ణ వెలుగులను చూసి...
బంగారంతో అద్దిన...
కెరటాలనుకుని...
మరింత ముందుకే సాగాను...
ఆ అలలు నా వైపు వస్తుంటే...
ఆశ్చర్యం...
ఆ అలల నుంచి...
పిల్ల గాలులు కాదు...
వేడి గాలులు వీస్తున్నాయి...
వాటిని చేరుకున్నాక ...
తెలిసింది...
అవి ...
అగ్ని కెరటాలని...
అగ్గి సంద్రంలో మునుగుతున్న...
నా నావను దరి చేర్చవా...
మనస్వినీ...
No comments:
Post a Comment