తారలమ్మ వెలుగువి..
ఇంద్ర లోకపు వన్నెలలో ...
విరిసిన పారిజాతానివా...
దివినుంచి భువికి రాలిన...
తారలమ్మ వెలుగువో...
నా మది సామ్రాజ్యంలో...
వెలసిన మహారాణివో...
కవి రాజుని నేనైతే...
నా కలం నుంచి జాలువారిన...
పసందైన గీతానివా...
జహాపనాను నేనైతే...
నువ్వు నా మనసులో ...
కొలువైన అనార్కలివా...
నా మనస్సు ఒక కొలనైతే...
నాలో విరిసిన కలువబాలవా..
ఎవరని చెప్పను నిన్ను...
ఏమని కొలువను నిన్ను...
నీకు మాత్రం తెలియదా...
నువ్వు నా భావలోకపు...
దేవకన్యవని...
మనస్వినీ...
No comments:
Post a Comment