మారిన రాత ...
నా రాత మారుతోంది...
మారుతున్న నా తల రాతలా...
అన్నీ నావే అన్నీ నేనే
అనుకుంటూ...
అక్షరాలను తేనెలో ముంచుతూ...
వేదనలను ఆవేదనలను...
తీయగానే రంగరించుకుని....
పదాల అల్లికలతో...
భావనలను విరబూయించాను...
తానే నేనై నేనే తానై...
అక్షరాలను దిద్దుకున్నాను...
తాను తాను కాదనీ...
నా అంతరంగం తాను కానే కాదని...
తనే పలికితే...
అక్షరాలు చెల్లా చెదురు కావా..
తీపి తేనె పలుకులు...
అమృతానికి బదులు...
హాలాహలాన్ని చిమ్మవా...
నా ప్రయత్నం లేకుండానే...
భావాలు మారిపోవా...
తను తను కాకున్నా...
నా పలుకులు మారినా...
అన్నీ ఆ పేరుకే అంకితం
ఇవ్వకుండా ....
ఎలా ఉండగలను...
నా రాత మారుతున్నా...
తలరాత తిరగబడుతున్నా...
అన్నీ అంకితం చేసుకునే....
నా మధుర నామధేయం..
మనస్వినీ...
No comments:
Post a Comment