తేనెటీగలు...
ఊహల తేనె పుట్ట...
నీ మనసే అయితే...
ప్రతి క్షణం ...
ప్రతి నిమిషం...
అమృతమే కురిసింది...
అమృతం తాగిన నేను...
దేవుడినే అనుకున్నా...
అమరుడినే అనుకున్నా...
అమరత్వం లోనే...
దివ్యత్వాన్ని వెతుక్కున్నా...
అమృతం కురిసిన రాత్రుల్లో...
తీపి స్నానాలే చేసుకున్నా...
జీవితం విషనాగులా...
తరుముతున్నా...
అమృతాన్నే ఆయుధంలా...
మలుచుకున్నా...
నా చుట్టూ అమృత ధారలతోనే...
కంచె నిర్మించుకున్నా...
అంతలోనే ఏమయ్యిందో...
అమృతం చుక్కలు చుక్కలుగా...
కరిగిపోసాగింది...
తేనె పుట్టపై గూడు కట్టుకున్న...
ఊహలనే తేనెటీగలు...
ఆ అమృతాన్ని ...
మొత్తం జుర్రుకున్నాయి...
మనస్వినీ...
No comments:
Post a Comment