ఓ చిన్న మాట...
ఓ మాట మరో మాట...
ఓ పలుకు మరో పలుకు...
మాట మాటలో ఎంత తేడా...
పలుకు పలుకులో ...
అంతే వ్యత్యాసం...
గుండెకు గుచ్చుకుని ...
గాయం చేసేది మాటే...
మనసు సుడిలో ...
అల్లకల్లోలం రేపేదీ పలుకే...
ఆప్యాయత తెరల్లో...
చీకటి నింపేది ఓ పలుకే...
గుండె గాయాన్ని కెలికేది ఓ మాటే...
డబ్బు కంపులో తడిసి ...
అత్తర్లు చల్లుకునేదీ ఓ పలుకే...
మమతల మనసును ...
ఛిద్రం చేసేది మాటే...
రాబందులైన బంధువుల ...
మేలి ముసుగూ తీయని పలుకే...
మూసిన పెదాలనుంచి మాయమై...
నొసటి నుంచి జారేదీ మాటే...
స్నేహమనే దుప్పటిని కప్పుకుని...
వెన్నుపోటు పొడిచేదీ పలుకే...
శూన్యంలో నుంచి ...
అన్నీ పుట్టించగల మహా శక్తీ మాటే..
ఊహల లోకంలో విహరించి...
నిజాన్ని అబద్దంలా నిరూపించేదీ పలుకే...
ఈ మాటల మతలబులో...
పలుకుల ఫలకంలో...
స్వాంతన ఇచ్చే ...
ఒక చిన్న మాటే...
కరువయ్యింది...
మనస్వినీ...
No comments:
Post a Comment