అన్నీ నీవే...
నా కనుల రెప్పల్లో..
తడి ఆరిపోతే....
మురిపించి మరిపించి...
వర్షించే...
అమృత ధారవు నీవు....
అలసిపోయిన నాగొంతు...
పలుకులు లేక మూగపోతే...
ప్రాణం పోసే పాటవు నీవు...
జీవనయానంలో ...
పరుగులు పెట్టలేక ...
మందగించిన ...
నా శ్వాసకు...
లయను నేర్పే...
ఊపిరివి నీవు...
అలుపెరుగని నా అడుగులకు...
అడుగుజాడవు నీవు...
విరామమే ఎరుగని ...
నా గుండెకు...
దాహం వేస్తే...
దప్పిక తీర్చే కొలనువు నీవు...
ఒక్కటేమిటి...
నా గమనం...
నా పయనం...
అన్నీ నీవే..
మనస్వినీ...
No comments:
Post a Comment