అక్షరం ఏడుస్తోంది...
చదువుకో నా అక్షరాలను...
ఒక్కసారి కాదు వంద సార్లు...
కాలం కళ్ళ ముందు
కదలాడుతుంది...
ప్రతి అక్షరం ...
ఒక అనుభవమై...
అనుభవంలో దాగి ఉన్న ...
అనుబంధమై...
గుండెను తాకుతుంది...
ప్రతి భావం వెక్కిరిస్తుంది...
ప్రతి పదం ఏడిపిస్తుంది...
గడిచిన కాలం...
ఆ మధుర స్మృతులు...
ఆ తీపి చేదు అనుభూతులు...
అక్షరాలుగా ...
నిన్ను వెంటాడుతూనే ఉంటాయి...
మనసు పెట్టి చూడు...
నా అక్షరం కన్నీరు కారుస్తోంది...
నా భావం...
గుండెలు పగిలేలా ఏడుస్తోంది...
గడిచిన కాలం ...
తిరిగి రాదనీ...
వసంతం మళ్ళీ చిగురించదనీ...
ఉదయం మరలా ...
ఉదయించదనీ...
నా కవిత్వం ...
ఘోష పెడుతోంది...
చదివిన నీ కళ్ళు...
లిప్తపాటయినా...
చెమర్చవా...
మనస్వినీ...
ReplyDeleteఅక్షరం ఏడుస్తోందా ? అయితే వెంట నే 'కరం' తో ముద్దాడండీ !!
జిలేబి