సవ్వడి లేని మనస్సు...
భాషే లేని భావమే...
భాష్యమయితే...
అది అర్థమే కోల్పోయి ...
అనర్ధమే అయితే...
సవ్వడి చేసే మనసు ...
మౌనముద్రలోకి జారిపోతే...
వర్ణం రంగులే లేక...
అవర్ణం గా మారిపోతే...
మనస్సులో మనసన్నదే..
లేకపోతే...
నేనన్న నేను ...
నాలో నేను లేక...
నీలో లీనం కాక...
అవునో కాదో తెలియక...
తెలిసీ తెలియని తికమక...
ఎవరికీ అర్థం కాని నేను...
నాకు నేనే అర్థం కానప్పుడు...
నీకు మాత్రం ...
ఎలా అర్థమవుతాను...
మనస్వినీ...
No comments:
Post a Comment