కవిని కాదు నేను...
ఎవరన్నారు నేను కవినని...
నేను కవిని కాదు...
కవితలు నాకు రావు...
యాస ప్రాసల ఆరాటం...
మాండలికాల జంజాటం...
నాకు తెలియదు...
భాషా ప్రావీణ్యం నాకు లేదు...
కవుల భాష నాకు రాదు...
నాకు తెలిసింది ....
రాసుకోవటమే...
మనసు భాషలో...
పుట్టిన అక్షరాలు...
లతలా అల్లుకుని...
భావంగా పుష్పిస్తే...
యాస ప్రాసలను పట్టించుకోను...
నాకు తెలిసింది ఒక్కటే..
మనసు భాష...
మనసున్న వాళ్ళందరికీ...
తెలిసిన భాష...
పండితులకే తెలిసిన...
యాస ప్రాసల భాష కన్నా...
నాకు తెలిసిన....
మనసు భాషలో ...
రాస్తూనే ఉంటాను...
మనస్వినీ...
ReplyDeleteహమ్మయ్య ! బతికాం !!
జిలేబి
నారాతలు చదువుతున్నారు ..
ReplyDelete