నిజమంటే...?
నిరంతర అన్వేషణ...
సాగుతూనే ఉంది...
కష్టాల కడలికి ఎదురీదుతూ ...
ఎడారి తిన్నెలను దాటవేస్తూ...
ఆనందంలో ఆనందంగా...
విషాదంలో విషాదంగా...
దానిని అన్వేషిస్తూనే ఉన్నా...
నిజమంటే ఎలా ఉంటుందో...
నిజం కోసం నిరంతర వేట నాది..
అవును నిజం ఎలా ఉంటుంది...?
అది నా మనసులోనే ఎక్కడో దాగి ఉందా...?
నా మనసులో ఉన్నది పలుకుల్లా ఉబికి వస్తే...
అది నిజం కాకుండా పోతోంది...
నా మనసులో ఉన్నది ఎందుకు అర్థం కాదు..
నాకు తెలిసింది కాకుండా...
తెలియనిది మాట్లాడితేనే నిజమా...?
నా గుండె పొరల్లో దాగి ఉన్నది నిజం కాదా...?
ఒకరికి నచ్చింది మాట్లాడితేనే అది నిజమా...?
నేను చేయనిది చేయలేనిది ....
చేసానని ఒప్పుకుంటేనే అది నిజమా...?
మనోసంద్రంలో ఉన్నది నిజం కాదా...?
ఒకరికోసమా...?
నాకోసమా...?
నేనెందుకు నిజాన్ని అన్వేషిస్తున్నా...
ఆ నిజమంటే ఏమిటో ....
ఎలా ఉంటుందో....
దాని రూపం ఎలా ఉంటుందో...
నాకు తెలుస్తుందా....?
ఎన్నటికీ దొరకకుండా....
అంతు చిక్కకుండా...
ఒక రహస్య పదార్థంగా మిగిలిపోతున్న...
నిజం జాడ నాకు దొరకదా...?
నిజం కోసం అన్వేషణలో...
ఒంటరిగా నేను...
నాకు తోడుగా నా నీడ...
ఇలా సాగిపోవలసిందేనా...?
ఇలా వేదనను మాత్రమే అందిస్తున్న ....
నిజం కోసం అన్వేషణ ఎందుకు....?
అంతు పట్టని నిజం కన్నా...
హాయినిచ్చే అబద్దమే మిన్న కదా...
మనస్వినీ...
No comments:
Post a Comment