అవి నా పలుకులే...
నీ గళం నుంచి జాలు వారే...
ఒక్కో అక్షరం ఒక పదంగా...
నా వీనులను తాకుతుంటే ...
ఆ తంత్రుల సవ్వడులు...
నా హృదయ వీణలో...
కోటి స్వరాలు పలికించవా...
ఒక రస ధునిలా...
వెన్నెల్లో కురిసే చల్లదనంలా...
నీ మాటలు నీ పలుకులు...
నా గుండెను తాకుతుంటే...
అవి నా మదిలో జనియించిన ...
బాసలే అయితే...
నా హృదయ సాగరంలో...
ఉప్పొంగిన అలలే అయితే...
నా కాల్పనిక జగత్తులో...
పుష్పించిన పువ్వులే అయితే...
ఒక్క మాటలో చెప్పాలంటే...
అవి నా కవితలే అయితే...
అవి నీ కంఠ స్వరం నుంచి...
రాలి పడినప్పుడు...
చెమర్చిన నా కళ్ళ నుంచి...
జారిపడిన ఓ కన్నీటి చుక్క...
అది నీకు...
నీకు మాత్రమే...
అంకితం కాదా...
మనస్వినీ...
No comments:
Post a Comment