దారి తప్పిన మనస్సు...
నా అడుగులో అడుగై...
అడుగుల జాడై...
తోడూ నీడై...
కలకాలం వెన్నంటి ఉంటాననీ...
కంటి పాపను నేనైతే...
కనురెప్పలా ...
ఊపిరి నేనైతే...
నాలోని శ్వాసలా...
మనస్సు తెర నేనైతే...
ఆ తెరపై బాపూ బొమ్మలా..
భావకుడిని నేనైతే...
నాలోని భావనల్లా...
చీకటిని నేనైతే...
నాలోని వెలుగులా...
వెలుగు బాటలు నేర్పుతానని ...
మనసారా మాటిచ్చింది...
తన మనస్సులోని చీకటిలో...
తానే దారి తప్పి ...
ఎటో వెళ్ళిపోయింది...
నాలోని వెలుగులా...
ఇది నా లోపమా...
మనస్వినీ...
No comments:
Post a Comment