మళ్ళీ తిరిగి రాకు...
ప్రతి క్షణం ...
ప్రతి నిమిషం...
ప్రతి ఘడియ ...
నాతోనే ఉన్నావు...
ఇప్పుడు విడిచి వెళుతున్నావు...
వెళ్ళిపోవటానికి ...
క్షణాలు లెక్కిస్తున్నావు...
వెళ్ళటానికే సిద్ధపడ్డావు...
వెళ్ళిపో...
నువ్వు వెళ్లిపోతేనే ...
బావుంటుంది నాకు...
మళ్ళీ రావద్దనే...
నా ఆకాంక్ష...
ఆశలపల్లకిలో ఊరేగించావు...
ఎన్నెన్నో బాసలు చేశావు...
మరెన్నో ఊసులు నేర్పావు...
చెమర్చిన కళ్ళలో...
కన్నీటినే నింపావు...
గుండె గుడులలో ...
సుడులనే రేపావు...
ఆవేదనలు ఇచ్చినా...
రోదనలు నింపినా...
నిజం నిజమే...
మధురిమలూ ఇచ్చావు...
ఆనందాల్ని పంచి ఇచ్చావు...
అన్నీ స్వల్పమే...
అన్నీ తాత్కాలికమే...
కాలమనే తులాభారంలో...
చివరకు నువ్వు...
మిగిల్చింది విషాదమే...
అందుకే నువ్వు వెళ్లిపోతేనే..
బావుంటుందేమో...
వచ్చే కొత్తలోనైనా...
కొత్తదనం వస్తుందేమో ...
అందుకే ...
ఈ సంవత్సరానికి ...
వీడ్కోలు చెప్పుకుందాం...
ఎంతో ఆశగా...
మనస్వినీ...
No comments:
Post a Comment