మనసు మాటే విన్నా...
ఎక్కడో ఏ మూలనో...
అంతర్లీనంగా...
ధ్వనించిన సవ్వడిని...
విన్నాను...
మనసేం కోరుకుందో...
మనసేం చెప్పిందో...
మనసు ఎలా కావాలనుకుందో...
మనసు ఎలా చూడాలనుకుందో...
మనసు ఎలా నడుచుకోమందో...
మనసుకు ఏది నచ్చిందో...
అదే చేసాను...
అలాగే నడిచాను...
నీ ప్రేమలో మెదడుకు పని
చెప్పలేదు...
మనసు మాటే విన్నాను...
చివరకు...
నా మనస్సునే...
కోల్పోయాను...
మనస్వినీ...
No comments:
Post a Comment