బాట సారిని నేను..
తప్పటడుగులు వేసే క్రమం నుంచి..
తప్పుటడుగులు వేసే స్థాయిని
దాటి...
తడబడే అడుగుల దాకా...
నా నడక సాగుతూనే ఉంటుంది...
నడుస్తూనే ఉంటాను..
నా బాటలో పూలతోటలు....
స్వాగతం పలికితే....
పులకించి పోతాను...
నవ్వులు రువ్వుతున్న పువ్వును
చూసి...
మైమరిచిపోతాను..
నవ్విన పువ్వే..
కొంటెగా నన్ను పలకరించిన
పువ్వే...
నన్ను చూసి...
జాలిగా నవ్వితే....
అక్కడి నుంచి జారుకుంటాను...
అయినా నడుస్తూ ఉంటాను...
నేను నడిచే బాటలో....
వాడిన వసంతమే...
ఎదురు వస్తే....
రాలిన పువ్వుల్లో..
వాడిన ఆకుల్లో....
గతం తాలూకు మధురిమలను ....
ఆశగా వెతుక్కుంటాను....
మోడు వారిన చెట్ల మానుల్లో...
ఎక్కడైనా దాగున్నాయేమోనని...
చివుర్లను అన్వేషిస్తాను...
నాకు తెలుసు అక్కడ ఏమీ
లేదని...
అయినా ఆ వాడిన వసంతంతో...
లిప్తపాటు సేద తీరుతాను...
మళ్ళీ పయనం...
అడుగులు ముందుకే పడతాయి...
గడిచిన ఘడియల అనుభవాలు...
సుడులు తిప్పిన బాధల గాయాలు...
నెమరు వేసుకుంటూ ...
నడుస్తూనే ఉంటాను...
ఎందుకంటే....
నేను ....
బహుదూరపు బాటసారిని...
మనస్వినీ....
No comments:
Post a Comment