కాగితం పడవలు...
తట్టు తగిలి కింద పడినా...
కాలికి ముల్లు గుచ్చుకున్నా...
ఒలికిన కన్నీటిలోనూ...
ఆనందమే...
ఎండ ఒంటిని మాడ్చేస్తున్నా...
అది వెన్నెలగానే ...
మురిపించింది...
బాధలేదు...
బంధం లేదు...
బాధ్యత అంటేనే తెలియదు...
ఎవరేమయినా...
ఫరవాలేదు...
ఎంతసేపూ నవ్వులూ...
విరబూసే పువ్వులు...
ఆ కొమ్మ నుంచి...
ఈ కొమ్మకు...
చింత తోపులో ఆటలు...
గోళికాయలు లేదంటే...
గిల్లిదండా పోటీలు...
వాన నీటిలో ...
కాగితం పడవలు...
అమ్మ చేతి గోరుముద్దలు...
ఎంత బావుంది ...
ఆ జీవితం...
బాల్యం మళ్ళీ రాదని తెలిసినా...
మనసు మరుస్తుందా...
మనస్వినీ..
No comments:
Post a Comment