నాకూ కన్నీళ్లు వస్తాయ్...
నాకూ మనస్సుంది...
ఆ మనస్సూ స్పందిస్తోంది...
ఆ మనస్సే ప్రశ్నలు వేస్తోంది...
చిరు గాలిలా...
చల్లని జల్లులా...
గుండెను ముద్దాడిన ఆ పువ్వును...
నా తోటలో అలంకరించుకోవటం...
నేను చేసిన అపరాధమా...
పువ్వుకు ముల్లు సహజం ...
ఆ ముల్లు మాయని గాయాలు ...
చేస్తుంటే...
మాటల తూటాలే పేల్చుతుంటే...
నా గాయాలు మండవా...
భగ్గుమన్న గాయాలకు...
నాకు కనీళ్ళు రావా...
నా కన్నీటికి అర్థమే లేదా...
అబద్దాల పునాదుల మీద ...
రాలి పడుతున్న ప్రశ్నలకు ...
ఎదురు ప్రశ్నలే పాపమా...
సమాజం ఎదురు తిరిగినా...
పరిస్థితులు తారు మారయినా...
గుండెల్లో పెట్టుకోవటమే...
అపరాధమా...
ఏం చేసాను నేను...
ఏ జన్మలో పాపానికి ఈ శిక్ష...
అవాంతరాలను దాటుకుంటూ...
కనిపించని శత్రువుతో పోరాడుతుంటే...
నా కంటికి కనిపించే ...
ప్రియ శత్రువుతో ...
పోరుకే సమయం గడిచిపోతోంది...
ఇదేనా జీవన పోరాటం...?
మనసు మమతానుబంధాలు...
ఇవేనా...
ఇలాగే ఉంటాయా...
తీయని మాటల వెనుక ...
మరో కోణం ఇంత దారుణంగా ఉందా..
అనుమానమే నీ మనసా...
అవమానమే నీ జీవన విధానమా...
అనుభవం తప్ప అనుబంధం నీకు లేదా...
అనుబంధమే ఉంటే...
నీ గులాబీ రేకుల పెదాలు...
అమృతానికి బదులు...
విషాన్ని చిమ్ముతాయా...
ఆవేశముండాలి...కాదనను...
ఆలోచన లేని ఆవేశమెందుకు...
నా మనసు అడిగే ప్రశ్నలకు ...
సమాధానం చెప్పవు...
నిన్ను నువ్వే ప్రశ్నించుకో...
నువ్వేంటి నన్ను తిరస్కరించేది...
మండుతున్న నా మనస్సే...
నీ మనస్సును బహిష్కరిస్తోంది...
మనస్సే లేని నువ్వు
నా అంతానికి
తొలి కారణం ....
మనస్వినీ...
No comments:
Post a Comment