వసంతమే నీవు...
నడిచి వెళ్ళిన వసంత రాత్రి...
కొంటెగా నవ్వుకుంది...
నిశి చీకట్లనే నాకు...
కానుకగా ఇచ్చి...
మబ్బు చాటున దాక్కున్న ...
జాబిలమ్మ గుంభనంగా ...
నవ్వుకుంది....
ఇక వెన్నెలమ్మ ఎక్కడనీ...
నింగి తారకలు...
ఫక్కుమని నవ్వుకున్నాయి...
మెరుపులమ్మ ఏదనీ...
పిల్ల గాలులు సవ్వడి చేయకుండా...
జారుకున్నాయి...
నీలి కురులు ఏమయ్యాయనీ...
వసంతరాత్రి తరలిపోయినా...
జాబిలమ్మ అలిగినా...
తారలన్నీ మూతి ముడుచుకున్నా...
వెన్నెలే కరువయినా...
నీ కన్నుల వెన్నెలే...
నాకు నవ వసంతం కాదా...
మనస్వినీ...
No comments:
Post a Comment