నాకు ఊపిరి పోస్తావా...
బీటలు వారిన నేలపై...
మళ్ళీ చిగురించాలని ఉంది...
మోడు వారిన మానుపై....
మారాకుని కావాలని ఉంది....
నిశ్శబ్ద కడలి....
అలల పై ...
ఉప్పొంగే కెరటం కావాలని ఉంది....
నెలవంక వెన్నెలలో....
చల్లదనాన్ని కావాలని ఉంది...
విరబూసే పువ్వుల్లో ....
స్వచ్ఛమైన నవ్వును నేను కావాలని ఉంది...
వాడిన వసంతంలో....
పచ్చదనం నింపాలని ఉంది...
వాడిన పువ్వుల్లో ....
రంగులు అద్దాలని ఉంది...
జీవన వేదికపై....
వసంత గీతం పాడాలని ఉంది...
జాలు వారుతున్న గీతానికి....
మనసారా నర్తించాలని ఉంది...
లయతప్పుతున్న నా శ్వాసలో....
నీవు ఊపిరి నింపుతావా....
మనస్వినీ...
No comments:
Post a Comment