కన్నీటి కొలను..
తడి ఆరని నీ కనురెప్పల మాటున..
జారి పడుతున్న కన్నీటి
చుక్కను...
దోసిట పట్టాను...
నా చెలియ నయనాల కొలనులో...
తేలియాడే ఆ నీటి చుక్క...
పుడమిని తాకటం ఇష్టం లేక...
చేతుల్లోనే ఇముడ్చుకున్నా ...
ఎంతో ఆర్తిగా..
ఆరాధనగా...
నా చేతుల స్పర్శతో ...
మరింత చెమ్మగిల్లిన ...
ఆ కన్నీటి చుక్క
అటూ ఇటూ దొరలుతూ...
నన్ను చూసి ఫక్కున నవ్వింది...
అమాయకుడా నన్నేం
చేసుకుంటావ్...
నీ ప్రియ సఖి కనుల్లో ...
నేనొక నదిలా పొంగుతున్నా....
నా ప్రవాహాన్ని ఆపగలవా..
అంటూ పుడమిపైకి జారుకుంది...
అవును...
నీ మదిలో చెలరేగుతున్న
తుఫానును ...
నేను ఆపగలనా ...
నీ కన్నీటి అలల తాకిడికి..
కొట్టుకుపోనా...
మనస్వినీ...
No comments:
Post a Comment