పదిలం సుమా...
చిరునవ్వులే చిందించావు...
ఆ పెదాలపై
మెరుపులేవీ...
ఆహ్లాదంగానే మాట్లాడావు...
నీ పలుకుల్లో ఆ చైతన్యమేదీ...
నాకే ధైర్యం చెప్పావు...
మరెన్నో జాగ్రత్తలు
చెప్పావు...
మరి నీలో ధైర్యమేదీ...
మాట్లాడుతూనే...
వీడ్కోలుగా చేయి ఉపుతూనే...
రెండు నిమిషాల్లోనే ...
ముందుకు కదిలావు...
వెళుతూ వెళుతూ ...
నాపై పడిన నీ చూపు నాకేం చెప్పింది...
ఆ కన్నులు ఏదో దాచుకుని...
తమ నుంచి బయటికి రానీయకుండా
...
ఎంత మధన పడ్డాయి...
అయినా ఆ కనురెప్పల మాటున ..
కనిపించీ కనిపించకుండా...
జారి పడిన ...
ఓ నీటి చుక్క..
అప్రయత్నంగానే ...
చెప్పింది నాకు వీడ్కోలు..
మనస్వినీ....
No comments:
Post a Comment