విశ్వనగరమా నీవెక్కడా?
విశ్వవిఖ్యాత సుందర స్వప్నమా
ఆకాశాన్ని ముద్దాడే భవనాల
సముదాయమా
విశ్వనగరమా నీవెక్కడా
పొంగుతున్న నాలాల్లో కొట్టుకుపోయావా
మునిగిన కాలనీల్లో గల్లంతయ్యావా
కుంగిన రహదారుల్లో చతికిలపడ్డావా
మిల్లీ మీటర్లు దాటి సెంటీమీటర్
ను తాకగానే
గుండెపగిలి చచ్చిపోయావా
విశ్వనగరమా నీవెక్కడా...
సూపర్, ఇటువంటి విశ్వనగరాన్ని ఇంతకుముందు చూడలేదు.
ReplyDeleteఆంధ్రావాళ్ళని దొంగలని తిట్టి సాధించుకున్న స్వతంత్ర రాష్ట్రం తిట్టడానికి ఎవరూ దొరక్క అస్వతంత్రం అయిపోయిందా!
ReplyDeleteఅయ్యా మహానుభావా..
Deleteనేను ఆంధ్రా వాళ్ళని తిట్టినట్లు నాకైతే గుర్తు లేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి పుణ్యముంటుంది. ఇక్కడ మీరొక విషయం గమనించాలి. హైదరాబాద్ లో ఇప్పుడు పొంగిన చెరువులు నీట మునిగిన కాలనీలు తెలంగాణా ఏర్పడిన తర్వాత పుట్టుకు వచ్చినవి కావు. ఆంధ్రా పాలనలోనుంచే నగరం ఆక్రమణలకు గురయ్యింది. అక్రమ నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు ఇచ్చింది కూడా ఆంధ్రా పాలకుల ప్రభుత్వాలే.. ఏం అప్పటి పాలకుల తెలివి ఏమయ్యింది. వారి తప్పిదాలే కదా నేటి ఈ దుస్థితికి కారణం..
https://youtu.be/P_Z1uzzXD6Q
Delete"కేసీఆర్.. అసూయతో రగిలితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది | మీడియా పరిస్థితి ఇంత దయనీయమా? | KCR | Hyderabad"
డెబ్బయయిదువేల పుస్తకాలు చదివానని చెప్పుకున్న KCR "చెరపకురా చెడేవు, ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదు, చేసిన పాపం ఇంగువ కట్టిన బట్ట!" అనే మామూలు సామెతల్ని ఎందుకు మర్చిపోయాడో - పాపం!
విశ్వనగరం అంటే కేసీఆర్ ఒక్కడే కూర్చుని తయారుచేయలేడు.అందరం కలిసికట్టుగా తయారుచేసుకోవాలి. తెలంగాణా అభివృద్ధికి ఎలా అయితే కృషి చేసారో అలాగే చేసుకోవాలి.నల్లా నీళ్ళు ఇవ్వడమే కాదు డ్రైనేజ్ పనులు కూడా చేస్తున్నారు. ఇపుడు చాన్స్ దొరికింది కదా అని కేసీఆర్ ని విమర్శిస్తున్నారు కానీ ఆంధ్రాలో పొలాలన్నీ మునిగిపోయాయి.పొలాలు మునిగిపోయినందుకు జగన్ నీ మూసీ కోసం కేసీఆర్ నీ తిట్టడం మానుకొని మనకేమి అవసరమో దానిని అడగాలి.పాతబస్తీ అభివృద్ధి ఎన్నటికీ జరగదని మీరు పెట్టిన ఫోటో తెలియచేస్తున్నది. అక్కడి ప్రజాప్రతినిధులను అడగాలి.
ReplyDelete