భావగర్జన
తిరగబడుతున్న అక్షరాలకు
జోలపాట పాడుతున్నా...
గర్జిస్తున్న భావాలను మనసు
బోనులో బంధిస్తున్నా....
నాకు తెలుసు నా అక్షరాలు
అల్లకల్లోలం చేస్తాయని...
నాకు తెలుసు నా భావాలు
నాపైనే పంజా విసురుతాయని...
నాకు బాగా తెలుసు
నా భావ కుసుమాలు
నా సమాధిపై సేదతీరుతాయనీ...
No comments:
Post a Comment