నమ్మకానికే
నమ్మకం
అక్షర పుస్తకం నీలాకాశమయితే
మెరిసే నక్షత్రమే నా అక్షరం...
సానుభూతి కోసం
సాగిలపడదు నా అక్షరం ...
లక్ష్యం లేని స్వచ్ఛమైన
పుష్పమే నా అక్షరం ...
బాధలొస్తే బెదిరిపోని
గుండె ధైర్యమే నా అక్షరం ...
మనసు సొదల వేదనలకు
ప్రతిరూపమే నా అక్షరం...
కన్నీరు ఒలికితే
కరిగిపోయే నీటి బిందువే నా అక్షరం...
చిరునవ్వులో చిగురించే
అందమైన భావమే నా అక్షరం ...
వేదన రగిలితే
అద్దంలా ముందు నిలిచేదే నా అక్షరం ...
మనో సంద్రం కదలికలో
ఎగసిపడే కెరటమే నా అక్షరం...
నీడను చూసి బెదిరిపోకుండా
భయానికే దడ పుట్టిస్తుంది నా అక్షరం...
పిడుగులే కురుస్తున్నా
సునామీలే దూసుకువస్తున్నా
మనసు భావానికే
దర్పణం పడుతుంది నా అక్షరం...
అర్ధం చేసుకునే మనసే ఉంటే
నమ్మకానికే నమ్మకం నా అక్షరం
మనస్వినీ...
chala bagumdi
ReplyDeleteథాంక్యూ హను ....
Delete