పాపం... ఆ కత్తి ఏం చేసింది...
మైనే పూఛా
ఖంజర్ సే ముఝే కిస్ లియే మారా
ఖంజర్ నే కహా
పాగల్ తుజే మైనే నహీ మారా
వో తో తేరా
దిల్ థా... కామ్ తమామ్ కర్ దియా ...
మెల్లగా కళ్ళు
తెరిచి చూశాను
అంతా కొత్తగా
వింతగా ఉంది...
దేహం తేలికగా
అనిపించింది
అసలు బరువే లేనట్టుంది...
ఆశ్చర్యంగా
ఉంది
నేను గురుత్వాకర్షణ
శక్తిని కోల్పోయానా...
గాలిలో తేలిపోతున్నట్టుగా
లేచి
కూర్చున్నా...
కలయా
భ్రాంతియా
నేను లేచి
కూర్చున్నా గానీ
నాదేహం అక్కడే
పడుకుని ఉంది...
అప్పుడు
తెలిసింది నాకు
నేను
చనిపోయానని
లేదు లేదు
నన్ను ఎవరో చంపేశారని...
నా చాతీ మీద
పెద్ద రంద్రం లాంటి గాయం
పక్కనే పడి
ఉన్న నెత్తురు ఆరని కరవాలం...
కోపం
తట్టుకోలేని నేను
ఆ కత్తిపై
అరిచాను
నన్నెందుకు
పొడిచావనీ...
కరవాలం ఫక్కున
నవ్వింది
అమాయకుడా
జీవమే లేని నేను
నిన్నెలా
పొడుస్తాను అంటూ...
కదిలే సత్తువ
లేని నేను
నిన్నెలా అంతం
చేయగలను...
సముద్రంలా
ఎగసిపడే నీ హృదయాన్ని
తాకే నిబ్బరం
నాకుందా...
పిచ్చివాడా
నిజం తెలుసుకో
నీ మనసే నిన్ను
చంపేసిందంటూ జాలి పడింది...
తడి ఆరుతున్న
రుధిరాన్ని తుడుచుకోవాలంటూ
ఆ కత్తి
మాయమయ్యింది...
ఆ కరవాలం
తప్పేముంది
నన్నెవరు
మాత్రం ఏం చెయ్యగలరు ...
నా మనసే నన్ను
అంతం చేస్తే
ఇంకేం
చెయ్యగలను
మృత్యుదేవత
ఒడిలో
కరిగిపోవటం
తప్ప....
No comments:
Post a Comment