కరిగిపోకు ఓ స్వప్నమా
అందమైన ఊహవు
నీవు
ఎన్నటికీ నిజం
కాకు ...
మెదడులోని భ్రాంతివి
నీవు
నిజమై నా ముందుకు
రాకు ...
పువ్వులోని
మెరుపువు నీవు
నిశి వైపు
అడుగులు వెయ్యకు...
నెలవంకలోని
వెన్నెలవు నీవు
ఎండమావిలో
కలిసిపోకు...
నా శ్వాసలోని
ఊపిరి నువ్వు
శ్వాస
నింపుకుని భువికి దిగిరాకు...
నిన్ను నిత్యం
ఆరాధిస్తా నేను
ప్రేమమయివై నా
వైపు రాకు...
నా కన్నులలో
వెలుగువు నీవు
నా వెలుగుకై
నువ్వు వెలగకు ...
కనురెప్పల
స్వప్నం నీవు
నా కంటి తెరను
వదిలి రాకు...
కంటి తెరలోని
కలగా
ఊహలో సుందరిగా
భావలోకంలో
నాయికగా
మనసుగుడిలో
దేవతగా
అక్కడే కొలువై
ఉండిపో...
నిజమై
నువ్వొస్తే
కసికాలపు
ఆటలలో
మనుషులు ఆడే
చదరంగంలో
అంతులేని
ఆవేశంలో
నువ్వుకూడా
రగిలిపోయి
కరిగిపోతావేమో....
అందుకే నీవు
ఊహా
సుందరిగానే మిగిలిపో
మనస్వినీ
No comments:
Post a Comment