గుండె గొంతు ఆర్తనాదం
తెల్ల కాగితం
మనసుపై
రంగు
రంగులబొమ్మలు ...
మోడు వారిన మనోభూమిపై
విరిసిన
పూదోటలు...
వికసించిన
పుష్పాల్లో
చిగురించిన
స్వప్నాలు...
ముభావమైన
భావంలో
కలలు రేపిన
భావాలు...
మనసుపై మసి
పూసి
బొమ్మలను మాయం
చేశారు...
విరిసిన పూదోట
ముళ్ళ కంపగా
మారింది...
ముడుచుకున్న
పుష్పాల్లో
స్వప్నాలు
సమాధి చేశారు...
ఉదయించిన
భావాల
గొంతు
నొక్కిపట్టారు...
మనసును గేలి
చేసే
జ్ఞాపకాలను
విసిరేసారు...
అద్దంలా
కవ్వించే
ఆనవాళ్ళను
పూడ్చేసారు...
గుండెకు
గుచ్చునే
గురుతులనూ చెరిపేసారు...
అన్నీ చెరిపెసినా
గురుతులన్నీ
విసిరేసినా
నిజాన్ని
పాతేసినా
మనిషినే మాయం
చేసినా
గుండె గొంతుకల
ఆర్తనాదాలను
ఆపగలరా...
గతించిన
జ్ఞాపకాల
ప్రవాహాలకు
ఆనకట్ట వేయగలరా...
వెంటాడే
జ్ఞాపకాలనుంచి
తప్పించుకు
పోగలరా...
పిచ్చి సమాజమా
నీ పిచ్చిగానీ
ఆనవాళ్ళను
పాతేసినా
అనుభవాలు
వెంటాడవా ...
Wonderful Painting with Heart Touching Words.
ReplyDeleteధన్యోస్మీ పద్మాజీ ..
ReplyDelete