మనసా నీకు వందనం
ఏదీ జరగలేదు
అమృత వర్షం
కురవనే లేదు...
వాడిన వసంతం
వికసించలేదు
ఎండిన చెట్లలో
మారాకు మొగ్గ తొడగలేదు...
ఎండమావులేవీ
నీటిచెలమలుగా
మారనే లేదు
...
కక్ష గట్టిన
సమాజం
స్నేహహస్తం
చాచలేదు...
రాబందు
బంధువులు
కోయిల పాట
పాడనే లేదు...
కుప్పకూలిన
శిఖరం
తల ఎత్తనే
లేదు...
మనసు కొలనులో
సునామీ ఆగనే
లేదు...
అదే వేదన
అదే రోదన...
అదే గుండె కోత
ఆగని ఆకలి
మంట...
దైనందిక పయనం
రోజూవారి సమరం
జీవనం మారనే
లేదు...
ఏదీ జరగలేదు
ఏదీ నిజం
కాలేదు...
మనసును వీడి
మనసు పయనమైతే
మార్పులు
వస్తాయని చెప్పినది
ఏదీ నిజం
కాలేదు...
కాలం మారదనీ
కొత్తవి ఏవీ
పుట్టుకు రావనీ
మనసుకు బాగా
తెలుసు...
పోయినదేదీ
రాదనీ
బతుకు సమరం
తప్పదనీ తెలుసు...
ఎవరున్నా
లేకున్నా
వాడిన పద్మం
ఏనాటికీ వికసించదని తెలుసు...
అందుకే
చెబుతున్నా చివరి మాటగా
మనసు
చెప్పింది ఏదీ జరగదు...
ఓసి మనసా
నీకు వందనం...
మీ అందమైన కవితకు నా వందనం.
ReplyDeleteధన్యోస్మీ పద్మాజీ ....
Delete