Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 7 April 2015

మనసు పువ్వులు



మనసు పువ్వులు


విరిసిన పుష్పం
నీ ముఖారవిందం
కనులనిండా నింపుకోనీ...
తెరిచి ఉన్న నా కనురెప్పలు
ఎప్పుడు మూసుకుపోతాయో
తెలియనే తెలియదు...
నిత్య సుగంధపరిమళం నీ శ్వాస
నా శ్వాసలో నింపుకోనీ
ఊపిరి ఎప్పుడు ఆవిరి అవుతుందో
ఎవరికి తెలుసు ...
మనసునిండా నిన్ను నింపుకొనీ
మనసు గుడిలో
నిన్ను ప్రమిదగా వెలగనీ
నా దీపం ఎప్పుడు ఆరిపోతుందో
ఎవరికి తెలుసు...
కనురెప్పల తెరలపై
కరిగిపోతున్న కలలను దోసిట పట్టు
కరిగే స్వప్నం కన్నీటి చుక్కలా
గుండెను తాకుతుందేమో...
నా దీపం ఆరినా
ఊపిరి గాలిలో కలిసినా
కలలు కరిగినా
నా మనసులోని పుష్పాలు
నిత్యం వికసిస్తూ
నీ కోసం విరబూస్తూనే ఉంటాయి
మనస్వినీ... 

No comments:

Post a Comment