తోటమాలిని
మాయలు మర్మాలు
నాకు తెలియదు
నా చేతిలో ఏ
మంత్రదండమూ లేదు...
స్వర్గాన్ని
నేను సృష్టించలేను
స్వర్గమేమిటో
తెలియదునాకు ...
బంధం అనుబంధం
అన్ని విలువలు
తెలుసు నాకు ...
బంధాన్ని
తిరస్కరించే అలవాటు లేదు నాకు
అనుబంధాన్ని
కాదనలేను నేను ...
నింగి నుంచి
జారిపడలేదు నేను
నేలపై విరిసిన
మట్టిపువ్వును నేను ...
సిరిసంపదల్లో పెరగలేదు
నేను
సంపదకోసం
ప్రాకులాడలేదు నేను...
నడుస్తున్న
చరితకు సాక్షిగా
చిన్న పూదోట
అల్లుకున్నా నేను...
పూలన్నీ
వాడిపోయి
వసంతం
ఎండిపోయి
ఆకులన్నీ
రాలుతున్నా
చూస్తూ
ఉండిపోయిన తోటమాలిని నేను...
No comments:
Post a Comment