Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday, 15 April 2015

మనసెందుకు విరిగింది ?

మనసెందుకు విరిగింది ?

ఓరిమి కోల్పోయిన మనసు
ఓదార్పునిస్తుందా...
ఎండమావుల తీరంలో
మనసు దాహం తీరుతుందా...
నడిచే శక్తి లేని పాదాలు
అడుగుజాడలు చూపుతాయా...
నీడే విడిచి పోతే
తోడు దొరుకుతుందా...
ఆశలు అడుగంటిన మనసులో
మారాకులు కనిపిస్తాయా ...
చిదిమేసిన గతం
స్వగతాన్ని మారుస్తుందా...
ఆలోచన మాయమై
ఆవేశం ముసుగు కప్పుకున్న మనసు
మరో మనసును తాకగలదా...
తిరస్కారమే నినాదమైన మనసులో
ఆస్కారానికి చోటైన ఉంటుందా...
ఆస్కారం నిజంగా మిగిలి ఉంటే
తిరస్కారం వచ్చేదా ...
మనసులోని భావాలు
మనసులోని వేదనలు
మనసులోని రోదనలు
మనసు నిజంగా చదివే ఉంటే
ఆ మనసు ముక్కలయ్యేదా...
ఎండమావి నా మనసు
కన్నీటినీ తాగేసింది...

No comments:

Post a Comment