మారని ఆలోచన
వేల అంతరాల అంతరంగమే
ఆలోచన ...
అంతరంగంలోని
అంతరాలకు అనుగుణంగా
మారుతూ ఉండేదే
ఆలోచన...
ఎప్పుడూ ఒకేలా
ఉండనిది
సులువుగా మారిపోతూ
ఉండేదే
ఆలోచన ...
జడత్వమే అలుముకుంటే
ఏ స్థితిలోనూ మారనిదీ
ఆలోచనే...
కాలానికి అనుగుణంగా
మారని ఆలోచనలో
జనియించేది
అంతులేని ఆవేశమే...
జడత్వమనే ముసుగులో
నిద్రిస్తున్న ఆలోచన
అనుమానాలను
రగిలిస్తుంది ...
ప్రతి నవ్వులో
వెటకారమే కనిపిస్తుంది...
పువ్వు పువ్వులో
ముళ్ళనే చూపిస్తుంది...
అయినవారిని
పరాయివారిగా
పరాయివారే అయినవారుగా
చూపిస్తుంది...
జడత్వం నుంచి రగిలిన
ఆవేశం
సర్వం నాశనం
చేస్తుంది...
ఆలోచనలో మార్పు రావాలి
అంతరంగంలో
ఆవేశం నశించి
సరికొత్త ఆలోచన మొగ్గ
తొడగాలి...
అప్పుడే పరాజయంలోనూ
విజయానికి దారులు
కనిపిస్తాయి
మనస్వినీ...
No comments:
Post a Comment