ఏమీ లేకపోతే ఎందుకు?
మనసు మనసుకూ మధ్య
ఏముంది
మనసుల మధ్య ఏమీ లేదా
...
ఇరుమనసుల మధ్య
విషయమే మిథ్య అయితే
మనసు మనసుకు మధ్య
అంతరం ఎందుకు ...
ఆ మనసు ఏమయితే
ఈ మనసుకు ఎందుకు ...
ఈ మనసు రోదిస్తే
ఆ మనసుకు ఎందుకు...
రెండు మనసులు
వేరు వేరయితే
ఒక మనసు మరో మనసుకోసం
ఎక్కడలేని ఆరాటం
ఎందుకు...
మనసుల మధ్య మమతే
లేకపోతే
ఈ ఘర్షణలు ఎందుకు ...
దూషణ పర్వాల తెరతీయటం
ఎందుకు...
ఆ మనసు ఏమయితేనేం
ఈ మనసుకు వేదన
ఎందుకు...
ఏమీ లేని మనసుల మధ్య
వివాదమే ఎందుకు...
మనసు మనసుకూ
అనుబంధమున్నది
ఇరు మనసుల మధ్య
మనసు బంధమున్నది ...
అందుకే అంతరాలు...
ఎక్కడలేని వివాదాలు...
ఒక మనసుకు మరో మనసుపై
అధికారమున్నది...
అంతులేని
అభిమానమున్నది
ఎక్కడలేని ఆజమాయిషీ
ఉన్నది...
మనసైన మనసు
మనసుకు
దూరమవుతుందేమోనని
కలవరపరిచే భ్రాంతి
ఉన్నది...
మనసు నిండా ప్రేమతోనే
మరో మనసును అనుమానిస్తున్నది
...
మనసూ మనసు ఆరాటంలో
ఇరు మనసుల కలయికలో
మనసు సొదల రోదలలో
విడదీయరాని చెలిమి
ఉన్నది...
ఇరు మనసుల మధ్య
అనురాగమే వివాదాలకు
మూలం
అది లేదనే అనుకుంటే
మిగిలేది శూన్యమే
మనస్వినీ...
No comments:
Post a Comment