తలవంచక తప్పదు
నింగి నుంచి రాలిపడి
ధూళిలో కలిసిపోయే
తారకను చూసి
మిడిసిపడకు ...
తారలే రాలిపోతున్నాయని
భ్రమల్లో ఉండిపోకు...
వెలుగును విరజిమ్ముతూ
వాయు మండలాన్ని
చీలుస్తూ
భస్మీపటలం చేసే
ఉల్కాపాతమూ
ఎదురునిలుస్తుంది
చూడు...
కడలిని దాటుకుంటూ
ఎగసిపడే అలలను చూసి
వచ్చిపోయే కెరటాలేనని
చిరునవ్వులు చిందించకు
ఉవ్వెత్తున
దూసుకువస్తూ
కొండలను పిండి చేసే
సునామీలో
కొట్టుకుపోతావు చూడు...
పిల్లగాలులే కదా అంటూ
గాలికి ఎదురు
నిలవకు...
హోరుగాలిలో
గడ్డిపోచలా
ఎగిరిపోతావు చూడు...
పైచేయి నీదేనని
విజయం నీదేననీ
క్షణప్రాయ ఆనందానికి లోనుకాకు
ప్రభంజనమై నిలిచిన
నా విజయానికి
ఓ సమాజమా నువ్వు
తలవంచక తప్పదు చూడు...
నా తోడు నా మనసుంటే
విజయం నాది కాక
ఇంకెవ్వరిది
మనస్వినీ...
పిల్లగాలులే కదా అంటూ
ReplyDeleteగాలికి ఎదురు నిలవకు...
హోరుగాలిలో
గడ్డిపోచలా ఎగిరిపోతావు చూడు...
పైచేయి నీదేనని
విజయం నీదేననీ
క్షణప్రాయ ఆనందానికి లోనుకాకు
ప్రభంజనమై నిలిచిన
నా విజయానికి
ఓ సమాజమా నువ్వు
తలవంచక తప్పదు చూడు... చాలా బాగా చెప్పారు.(.వాణి శ్రీవిద్య )