కోయిలమ్మ పాట నీ పిలుపు
పరిమళించిన నా మనసులో
మొగ్గ తొడిగిన
నా భావం ప్రాణం
పోసుకుంటే
ఆ ప్రాణం ఒక
ఆకృతి లా
రూపం సంతరించుకుంటే
ఆ రూపం నీదే...
మూగబోయిన
వీణ తంత్రులు
మళ్ళీ సవరిస్తే
జనియించిన
సవ్వడి నీ తీయని
పలుకే...
అందియల రవళిలో
పదమువ్వల సవ్వడిలో
లయబద్దమైన నర్తనం
అది నీ మయూర నడకే...
పక్షుల కిలకిలరావాలలో
కోయిలమ్మ పాటలో
పిల్ల గాలుల్లో
వినిపించేది నీ
పిలుపే...
నీలాల నింగిలో
పచ్చని పైరులో
సెలయేటి పరుగులో
ఎక్కడో ఎందుకు
నా మనసు రొదల్లో
సర్వం
సమస్తం
అన్నీ
నీ ఉనికినే
చాటుతున్నాయి
మనస్వినీ...
No comments:
Post a Comment