టాం అండ్ జెర్రీ అండ్ తల్లికోడి
ముగ్గురు కలిస్తే
ముప్పేట సమరమే
ఒకరు మాటల చెణుకులు
మరొకరు చేతల బాణాలు...
ప్రశాంతంగా ఉన్నట్టే
ఉంటుంది
కానీ అంతా
అల్లకల్లోలమే ...
ఎవరు ఏమంటారో చెప్పలేం
ఎవరు కలబడతారో
ఊహించలేం...
ఇల్లంతా ఉరుకులు
ఎటుచూసినా పరుగులు...
అలిసిన వేళ
ఆ రెక్కల కింద కాసేపు
విశ్రాంతి...
ఎక్కడ జారిపోతమోనని
రెక్కలకింద ఆరాటం...
ఆప్యాయతతో
కమ్ముకునే రెక్కలు...
కొద్దిసేపే ఈ సంధికాలం
మళ్ళీ తప్పదు
పోరాటం...
ఆ తల్లి రెక్కల
కొంటెదనం
ఇద్దరిలో నవ
ఉత్సాహం...
అదే దృశ్యం
అదే పోరాటం...
ముగ్గురూ ముచ్చటైన
పిల్లలుగా
బాల్యంలో మమకారం
కలిసిపోయి
కొనసాగుతుంది చిలిపి
పోరాటం...
మాటల బాణాలు
చెణుకుల తూటాలు
అప్పుడప్పుడూ
ముష్టిఘాతాలు
ఆ ముగ్గురు ఒక చోట
చేరితే
ఇవే నిత్యానుభావాలు
...
అవును ఆ ముగ్గురూ
నా ప్రేమకు
ప్రతిరూపాలు...
ఆ ముగ్గురిని చూస్తే
ఎంతో
ముచ్చటేస్తుంది...
ఆ ఇద్దరు మా పిల్లలైతే
తను మమకారం ...
ఆ ఇద్దరు
టాం అండ్ జెర్రీ అయితే
ఆమె తల్లికోడి
టాం అండ్ జేర్రీల
సమరానికి
ఆ తల్లికోడి రెక్కలే
యుద్ధ క్షేత్రం ...
టాం అండ్ జెర్రీ
తల్లికోడీ
మీరే నా కలల
ప్రపంచం...
hummmmm nannu kodini chesarannamata....ok
ReplyDeleteahhhaaaa
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete