మనసులోనే మనస్వినీ...
నా భావం అజరామరం...
నా భాష్యం నిత్యకృత్యం...
నా భావాలు ఎప్పుడూ ఉంటాయి...
నా రాతలు నిత్యం ఉంటాయి...
అదే భావం ...
అదే భాష్యం...
అదేరాత...
అన్నీ అలాగే ఉన్నా
ఒక్క మార్పు మాత్రం సుస్పష్టం...
నా భావం ఉంటుంది...
ఆ భావంలో
మనస్విని ఉండదు...
నా భావం
నా భాష్యం
నా హాస్యం
నా లాస్యం
నా సర్వం
మననిస్వినికే అంకితం...
అయినా
కానరాదు మనస్విని...
మనస్విని ఒక మనిషి కాదు
అది ఒక భావం...
నా ఊహా...
నా ఊహలన్నీ రంగరిస్తే
రూపుదిద్దుకున్న ఆకారం...
నా భావం ఒక ప్రపంచమే అయితే
ఆ లోకంలో నడియాడే దేవతే మనస్వినీ...
అయినా అది కారాదు
మరొకరికి అపకారం ...
నా భావం నా స్వగతం
అది ఎవరిదీ కాదు వ్యక్తిగతం...
అందుకే నారాతల్లో
నా పలుకుల్లో
నా భావంలో
మనస్విని కానరాదు...
అది నా ఊహా...
ఊహాసుందరి మనస్వినిని
రాతల్లో త్యజించి
మనసులోనే పదిలం చేసుకుంటున్నా
నా మనసుకు
అంతిమ సంస్కారం జరిగిన రోజు
అంతం అవుతుంది
నా మనస్విని...
No comments:
Post a Comment