అమృతవర్షం
ఎవరు తట్టిలేపారని
నా మనసును ...
ఎవరు తొంగి చూసారని
నా గుండెలోకి ...
ఎవరు శోధించారని
నా కళ్ళలో నీటి
సుడులను ...
ఎవరు చదివారని
నా మనసులోని
భావాలను...
సముద్రమంత మనసు నాది
కెరటమంత భావం నాది...
సాగరంలో గరళం
నా గుండెలో ఆవేశం...
ప్రతి సుడిలో నా
అంతరంగం..
కదిలించి చూస్తే
ఉబికేది గరళమే...
గరళాన్ని చూసి
బెదిరిపోతే
తెలిసేది నా
అంతరంగమా...
మధించి చూస్తే
అమృత ధారలే తన్నుకు
రావా...
జనియించిన అమృతం
ఆవర్తనమై
తీయనివర్షం కురిపించదా...
No comments:
Post a Comment