మన్నించు మనస్వినీ
ఆలోచన అంతమయ్యింది
ఆవేశం రగిలింది...
విచక్షణ కరిగిపోయింది
మాటలు ఈటెలయ్యాయి...
పలుకులు గునపాలుగా
చేతలు శూలాలుగా
పరిణమించాయి...
ఓ గుండెకు గాయమయ్యింది
ఓ మనసు చెదిరిపోయింది...
సమాజం తూట్లు
పొడుస్తున్నా
బండరాయిగా మారిన
మనసుకు
మనసైన మనసే గాయం
చేసింది...
ఆవేశం నశించి
ఆలోచన చిగురు
తొడిగింది...
చేసిన పాపం
వెక్కిరించింది...
మాటల తూటాలు
నవ్వుతున్నాయి...
అర్థమే లేని వాదనలు
కన్నీరు
పెడుతున్నాయి...
మసున మనసును
ఛిద్రం చేసిన మనసు
సిగ్గుతో
తలవంచుతోంది...
మనసుపై మనసులో
కొంతైనా మనసుంటే
మన్నించు మనస్వినీ...
No comments:
Post a Comment