Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 22 December 2014

బంగారుతల్లి...


బంగారుతల్లి...

 
 













పువ్వు పుట్టగానే ...
పరిమళించినట్టు...
నాజీవన పూదోటలో ...
వికసించిన నువ్వు...
బోసి నవ్వులతో....
ముచ్చటైన కేరింతలతో...
ముద్దు ముద్దు నడకలతో ...
నా గుండెలపై ఆడుకున్నావు...
చిన్నతనం నుంచే నాకు ...
వసంతం లా మారావు...
ఒక్కో అడుగు వేస్తూ ...
బాల్యాన్ని దాటుకుంటూ...
ఎదుగుతున్నావు...
ఎదిగిన కొద్దీ ఒదుగుతూ..
నాకే జీవితాన్ని నేర్పుతున్నావు...
నా కన్ను చెమర్చితే...
నీ కంట నీరు ఒలికించుకున్నావు...
అలసి ఇంటికి చేరిన నన్ను...
గోముగా పలకరిస్తావు...        
నీ ముద్దు ముద్దు ముచ్చట్లతో ...
సేద తీరుస్తావు...
విషాదంలో ఉంటే నేను...
అమ్మలా ఓదారుస్తావు...
మాటలతో స్వాంతన ఇస్తావు...
అలా కాదు ఇలా చేయమని ...
దారి చూపిస్తావు...
నీకోసమే నేను ఇంకా ఉన్నా..
నీకోసమే ఈ ముళ్ళ లోకాన్ని ...
ఇష్టంగా భరిస్తున్నా...
నీ ఎదుగుదల...
నీ విశ్వాసం నేనై...
నీకు ఒక స్థూపం నేనై...
నీ జీవన సౌధాన్ని...
నిర్మించాలని ఆరాటపడుతున్నా...
నీకోసమే జీవన పోరాటం చేస్తున్నా..
చేస్తూనే ఉంటా...
నీవు నా ప్రాణ వాయువువి...
నీవు నాజీవన దాతవి..
ఒక్క మాటలో చెప్పాలంటే  నాకు...
అమ్మవు నీవు...
గారాలపట్టి నా బంగారు తల్లికి...
పలుకుదాం మన హృదయపూర్వక ...
జన్మదిన శుభాకాంక్షలు...
మనస్వినీ....

4 comments:

  1. బంగారుతల్లి.

    ReplyDelete
  2. Telugu lo Rayadaniki
    http://alllanguagetranslator.blogspot.in/2013/05/blog-post.html

    ReplyDelete
  3. belated birthday wishes to your dear daughter...
    wishing her the best of life the almighty could give...
    and wishing the father, the best the daughter could give...

    ReplyDelete