జవాబు లేని ప్రశ్నని...
రాలి పడుతున్న కన్నీటి చుక్క......
ప్రశ్నలు సంధిస్తోంది...
ఒకచుక్కలో సవాలక్ష ప్రశ్నలు...
ఒక్కొక్కటిగా రాలిపడుతున్న
చుక్కలు...
సుడులుగా తిరుగుతూ ...
కురుస్తున్న ప్రశ్నల వర్షం ...
ఉక్కిరిబిక్కిరవుతున్న మనస్సు....
ఒక్కో ప్రశ్న గుండెకు...
సూటిగా గుచ్చుకుంటున్నా....
తుపాకీ గుండులా చిద్రం
చేస్తున్నా..
మాయలేని గాయం చేస్తున్నా..
మౌనంగానే బదులు చెబుతున్నా...
తన ప్రశ్నలకు సమాధానాలు...
సమాధానాలపై...
కొత్త ప్రశ్నలు పుట్టుకు
వస్తున్నా...
కన్నీటి ప్రశ్నలకు ...
సమాధానం చెప్పలేకున్నా...
నేను చేసింది ఏమిటో ...
అర్థం కాక ....
మౌనంగానే ఉండిపోతున్నా...
ఎందుకంటే నేను...
జవాబు లేని ప్రశ్నను....
మనస్వినీ...
No comments:
Post a Comment