ప్రేమ లెక్కలు...
నేనేంటి...
నువ్వేంటి...
నాలో నువ్వెంత...
నీలో నేనెంత...
మొత్తం నువ్వేనా...
నాలో సగమా...
లెక్కలు తీస్తూపోతే...
లెక్కలు లెక్కలుగానే...
మిగిలిపోవా...
ప్రేమకు లెక్కలుంటాయా..
అనుబంధానికి...
కొలమానముందా...
మనసుకు విలువ కట్టగలమా...
ఎన్ని మధురాలు...
ఎన్ని విషాదాలు...
ఏది ఎక్కువో ఏది
తక్కువో...
లెక్కించగలమా...
లెక్కించుకునేది ప్రేమా...
వంతులు వేసుకునేది
అనురాగమా...
ఇలా లెక్కించుకుంటే...
కూడికలు తీసివేతలు...
చేస్తూ ఉంటే...
నీలో నేనే కదా మిగిలేది...
మనస్వినీ...
No comments:
Post a Comment