Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 13 December 2014

మూగవీణ....



మూగవీణ....


మూగబోయిన వేణువులో ......
రాగం పలికించాను...
రాలిపడిన మువ్వలకు...
సవ్వళ్ళు నేర్పించాను...
వాడిపోయిన పువ్వుల్లో...
నవ్వులు విరబూయించాను...
మోడువారిన మానులో...
మారాకునయ్యాను...
వాడిన వసంతంలో ...
తొలి పూతనయ్యాను...
చెమర్చిన కళ్ళలో...
కన్నీటి బిందువయ్యాను...
అన్నీ చేసిన నేను...
నీ హృదయ వీణను...
పలికంచలేకపోయాను...
మనస్వినీ....

No comments:

Post a Comment